నేటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు..మరికొన్న దారిమళ్లింపు

some-trains-are-cancelled-and-some-diverted

విజయవాడః దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు గుంటూరు-విశాఖపట్టణం (17239), 11 నుంచి నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్టణం-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, 10వ తేదీ నుంచి 16 వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ (17267-17268), రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467) రైళ్లను రద్దుచేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

వీటితోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. ధన్‌బాద్-అళప్పుల (13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ను 11, 14, 15వ తేదీల్లో, హటియా-ఎస్ఎంబీ బెంగళూరు (12835) రైలును 11న, 14న టాటానగర్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు (12889), 15న హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637) రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని త్రిపాఠి కోరారు.