మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న జూ. ఎన్టీఆర్

జూ. ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ కుటుంబంలో సంతోషం నింపారు. చిత్రసీమలో హీరోలకు అభిమానులే కాదు ప్రాణం ఇచ్చే అభిమానులు ఉంటారు. అలాంటి వారి కోసం ఏమైనా చేయడానికి మన హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిలో జూ. ఎన్టీఆర్ ఒకరు. తమ అభిమాని కష్టల్లో ఉన్న , ప్రాణాపాయస్ధితిలో ఉన్న ఆదుకునేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తాజాగా మరోసారి అదే చేసాడు.

జనార్థన్ అనే ఓ అభిమాని పరిస్థితి క్రిటికల్ గా వుందని అతను ఐసీయూలో వున్నాడని తెలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సదరు హాస్పిటల్ కి తన టీమ్ ని పంపించారు. ఫోన్ ద్వారా అక్కడే తనయుడు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అతని తల్లితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్య పడకుండా దేవుడిని నమ్మండి..దేవుడిపైన భారం వేయండి.. మేమంతా వున్నాం..త్వరలోనే తను కోలుకుని క్షేమంగా తిరిగి వస్తాడని మీరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అధైర్య పడొద్దని మీరు తన పక్కనే వుండి ధైర్యం చెప్పండని తన అభిమాని తల్లికి ధైర్యం చెప్పారు. జనార్ధన్‌ తో ఫోన్ స్పీకర్ ద్వారా మాట్లాడిన ఎన్టీఆర్.. నిన్ను చూడాలని ఉంది. త్వరగా కోలుకుని వచ్చేయ్‌ అంటూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..త్వరలో కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.