సిగరెట్ తాగే వారికి కరోనా మరింత ప్రమాదకరం..
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి

అమెరికా : కరోనా వైరస్ వల్ల సిగరెట్ తాగే వారికి కరోనా వస్తే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేల్చిచెప్పింది. మిగతా వారితో పోలిస్తే పొగతాగేవారిలో కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని తేలింది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు పొగతాగిన వారి, తాగని వారి ఊపిరితిత్తుల కణజాలాల్లో ఉన్న రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా శ్వాసమార్గంలోని వైరల్ ఇన్ఫెక్షన్కు గురయ్యే ఏసీఈ 2, ఫ్యూరిన్, టీఎంపీఆర్ఎస్ ఎస్ 2 కణజాలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. అసలు పొగతాగని వారితో పోలిస్తే తక్కువలో తక్కువగా 100 సిగరెట్లు తాగిన వారి ఊపిరితిత్తుల కణజాలలు వైరస్ బారినపడే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/news/national/