శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్

సూడాన్ కు చెందిన మహిళకు అస్వస్థత-చికిత్స పొందుతూ మృతి

Badr Airlines
Badr Airlines

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురి కావడమే ఇందుకు కారణం. 

సుడాన్ నుంచి మస్కట్ వెళ్ళాల్సిన బాడర్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

అస్వస్థతకు గురైన సూడాన్ కు చెందిన ఆ మహిళను హుటాహుటిన ఎయిర్ పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/