ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలుఘటనలు చోటుచేసుకోగా..బుధువారం ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు సంభవించాయి. హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు వద్ద రాగానే పొగలు రావడంతో రైలును నిలిపివేశారు.

ఒక్కసారిగా రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. అయితే, బ్రేక్‌లైన్‌ పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా సిబ్బంది పేర్కొన్నారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది సంఘటనా చేరుకొని మరమ్మతులు చేశారు. దాదాపు అరగంట తర్వాత రైలు మళ్లీ బయలుదేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు