ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై మంత్రి హరీష్ రావు ఫైర్

బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పలువురు బిజెపి , కాంగ్రెస్ నేతలు హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడుతూ..సంగారెడ్డి ఎమ్మెల్యే సంగారెడ్డి ఫై నిప్పులు చెరిగారు.

ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి నియోజకవర్గం అస్సలు ఎలా ఉందన్న విషయం పట్టించుకుంటున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలకు వచ్చిండు జోలె పట్టి ఓట్లు అడిగిండు కానీ అప్పటి నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడంటూ జగ్గారెడ్డి పై విమర్శలు చేసారు. అందుకే ప్రజలు ఈ సారి జగ్గారెడ్డి కి విశ్రాంతి ఇవ్వాలంటూ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ BRS అభ్యర్థిగా ఎవరు నిలబడినా అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించుకోవాలని హరీష్ రావు నేతలలో ధైర్యాన్ని నింపారు.