సంక్రాంతి ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్న APSRTC

ప్రయాణికులకు APSRTC సంక్రాంతి ఆఫర్ ను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ పండక్కి వెళ్లేందుకు రెండు నెలల ముందు నుండే ప్రయాణికులు బస్సు , రైల్వే , విమాన టికెట్స్ బుక్ చేసుకుంటారు.

ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ఊరెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికులకు APSRTC శుభవార్త అందించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీఎస్ ఆర్టీసీ. అయితే, ఈసారి ఈ స్పెషల్ బస్సుల్లో ‘అదనపు’ బాదుడుకు స్వస్తి పలికిన అధికారులు.. ప్రత్యేక రాయితీ కూడా కల్పించారు. జనవరి 6వ తేదీ నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, పండుగ రద్దీని బట్టి 15 నుంచి 18 వరకు ఆయా బస్ డిపోల నుంచి బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఇక రానుపోను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ ప్రకటించారు.