జగన్ కు తానంటే ఎంత భయం పట్టుకుందో చూడండి అంటూ లోకేష్ సెల్ఫీ

నారా లోకేష్ మరోసారి సీఎం జగన్ ఫై సెటైర్లు వేశారు. గత కొద్దీ రోజులుగా యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర లో ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ జగన్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. అలాగే పోలీసులు సైతం పలు చోట్ల లోకేష్ యాత్ర ను అడ్డుకోవడం తో వారిపైన కాకుండా జగన్ ఫై కూడా విమర్శలు , సెటైర్లు వేస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు లోకేష్.

తాజాగా మంగళవారం లోకేష్ మరో ట్వీట్ పెట్టారు.‘‘నేనంటే ఎందుకింత భ‌యం జ‌గ‌న్‌? ఈ సెల్ఫీలో నా వెనుకున్న వాహ‌నం చూశారా? అదేనండి వ‌జ్ర వాహ‌నం. మ‌త‌క‌ల‌హాలు, ఘ‌ర్షణ‌లు చెల‌రేగిన‌ప్పుడు ఉప‌యోగిస్తారు క‌దా! అదే.. ప్రశాంతంగా సాగుతున్న నా పాద‌యాత్రకు ర‌క్షణ క‌ల్పించాల్సిన‌ పోలీసులు జ‌గ‌న్ రెడ్డి ఆదేశాల‌తో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంత‌కుమించి వ‌జ్ర వాహ‌నం అవ‌స‌రం ఏమొచ్చింది? నేనంటే జ‌గ‌న్ రెడ్డికి భ‌యం. అందుకే అడుగ‌డుగునా అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో నా పాద‌యాత్ర సుబ్బనాయుడు కండ్రిగ గ్రామం చేరింది. నా వెంట పోలీసులు, ఇదిగోండి ఈ వ‌జ్రవాహ‌నం కూడా జ‌గ‌న్ రెడ్డి గారు పంపారు. ఇవి చూశాక మీరే చెప్పండి నేనంటే జ‌గ‌న్‌కి ఎందుకింత భ‌యం?’’ అని నారా లోకేష్ ట్వీట్ చేసారు.