బస్సు యాత్ర లో జగన్ కు చేదు అనుభవం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత , సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఈ యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. కాగా గుత్తిలో మాత్రం జగన్ కు చేదు అనుభవం ఎదురైంది.

జగన్ ప్రచార రథంపై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరారు. గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద బస్సు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా పైనుంచి పడుతున్న చెప్పును చూసి పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సుపై సీఎంతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నైరుతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ ఉన్నా ఎవరిపైనా చెప్పు పడలేదు.