పవన్ కళ్యాణ్ ఫై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన పోసాని

ముద్రగడ పద్మనాభం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేసారు. ముద్రగడ ను పట్టుకుని చెప్పుతో కొడతాను అంటారా ..ఒక కాపు మరో కాపును తిట్టడం ఏమిటయ్యా.. రాజకీయం వేరు కులం వేరు.. ఇవి తెలుసుకుని ప్రవర్తించు అంటూ పవన్ కళ్యాణ్ ఫై పోసాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నేను నీ గురించి చాలా ఊహించుకున్నాను.. ఇంతలా తెలివిలేకుండా మాట్లాడుతున్నావేమిటయ్యా అన్నారు.

పవన్ రాజకీయంలో ఇప్పుడు ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వ్యక్తి.. అస్సలు ఈ రాష్ట్రంలో కాపుల మధ్యన గొడవలు మొదలైంది పవన్ రాజకీయాల్లోకి వచ్చాకే అన్నారు. పవన్ కళ్యాణ్ ముద్రగడ పై చేసిన వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబును మరియు టీడీపీని ఎన్ని విధాలుగా తిట్టావు పవన్.. ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు సీఎం కావాలని అంటున్నావు అంటూ పోసాని రెచ్చిపోయారు.