నేడు ఢిల్లీకి షర్మిల..ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంచొచ్చు..!!

ys-sharmila-slams-ys-jagan

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంకో 45 రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతుండడం తో కూటమి పార్టీ లతో పాటు అధికార పార్టీ వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటిచలేదు. దీంతో కాంగ్రెస్ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తుంది..ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక కోసం ఏపీసీసీ చెఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

ఆ భేటీలో ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే 175 స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారు. సీఈసీ భేటీకి ముందు కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల సమావేశం అవుతారు. కాంగ్రెస్ అభ్యర్థులపై ఈ రోజు స్పష్టత వస్తుందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్ సభ, అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. 1500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని శనివారం నాడు వైఎస్ షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను సోమవారం (ఏప్రిల్ 1)న ప్రకటించే అవకాశం ఉంది.