ఖమ్మం ఎంపీ సీటు ఫై కమలం గురి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాగే సత్తా చాటాలని చూస్తుంది. ఆ ఛాన్స్ కాంగ్రెస్ కు ఇవ్వకూడదని మిగతా పార్టీ లు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ సీటు కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుండి ఏకంగా 12 మంది దరఖాస్తులు చేసుకోగా..ఇప్పుడు బిజెపి కూడా ఈ సీటు ఫై కన్నేసింది.ఈసారి సత్తా చాటాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెడుతోంది బిజెపి. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. లోక్ సభ స్థానం పరిధి లోని అన్ని మండలాల భాజపా అధ్యక్షులు, ముఖ్యనాయకుల అభిప్రాయాలను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చాడ సురేష్ రెడ్డి ఇటీవల సేకరించారు. అందరి అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయాలని కాషాయ పార్టీ భావిస్తోంది. మరి ఎవర్ని ఫైనల్ చేస్తుందో..అటు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ టికెట్ ఇస్తుందో..బిఆర్ఎస్ నుండి ఎవరు బరిలో నిల్చుంటారనేది ఆసక్తి గా మారింది.