కెసిఆర్ తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారుః షబ్బీర్ అలీ

shabbir-ali

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ప్రభాకర్ రావు రిటైర్ అయ్యాక ఆయనను పావుగా వాడుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారని బిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ అయిదేళ్ల పాటు ట్యాపింగ్‌లో ఉందన్నారు. చివరకు కెసిఆర్ తన సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కెసిఆర్ దుర్మార్గం బయటపడిందన్నారు.