సార్స్ ఫీవర్

ఆరోగ్య సంరక్షణ (ప్రతి సోమవారం)

sars fever
sars fever

సార్స్ ఫీవర్ .. దీన్ని సివియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ గా వ్యవహరిస్తారు. ఇది జంతువుల్లో కనిపించే ఇన్ఫెక్షన్. ఇది మనుషులకు సార్స్ సీవోయు వైరస్ వలన వస్తుంది. ఇది కొత్త వైరస్. జంతువుల్లో శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ కల్గించే ఈ వైరస్ మనుషులకు ప్రమాదకరంగా , ప్రాణాంతకరంగా ఎలా పరిణమించిందో వైద్య శాస్త్ర నిపుణులకు అర్ధం కావటం లేదు. దీన్ని వైరల్ రెస్పిరేటరీ డిసీస్ అని అంటారు. ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిగా , వైరల్ ఇన్ఫెక్టీవ్ న్యూమోనియా వ్యాధిగా గుర్తించారు. వైరస్ వాళ్ళ వచ్చే ఈ వ్యాధిని 2003లో డబ్ల్యూ .హెచ్. ఓ ఎపిడమిక్ గా గుర్తించింది.

ఇండియా లో ఏటా 500 కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ ను జంతువుల్లో 1937లో మొదట చికెన్స్ లో గుర్తించారు. మెల్లగా చైనా నుండి కెనడా, హాంకాంగ్, సింగపూర్, హనాయ్ , యూఎస్ వంటి 26 దేశాలకు విస్తరించింది. దాదాపు 2002-2004 వరకు 8 వేల కేసులను గుర్తించారు.

ఈ కేసుల్లో 773 మంది మృతి చెందారు. జీన్ ఫెంగ్ హి పరిశోధనల ప్రకారం గబ్బిలాలు, రాకూన్ కుక్కలు, సివెట్ పిల్లులలోని వైరస్ జీన్స్, ఎంజైమ్స్, ప్రోటీన్ నిర్మాణంలోని మ్యుటేషన్ వలన వైరస్ సరికొత్తగా,పవర్ ఫుల్ గా తయారై మనుషులను ఎఫెక్ట్ చేసే సామర్ధ్యం కల్గి ఉందని తేల్చి చెప్పారు. 10 శాతం హెల్త్ వర్కర్లు, ల్యాబ్ టెక్నిషన్స్ లో ఆక్సీడెంటల్ గా వస్తుంది. 10-60 శాతం ఎక్సపోజ్ కావటం వలన వ్యాధి వస్తుందని గుర్తించారు. పది మందిలో ఒకరు చనిపోవటం జరిగింది. యూకే లో 4 కేసులు మాత్రమే నమోదు కావటం గమనార్హం.

వ్యాప్తి:

గాలి ద్వారా మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారి ద్వారా వ్యాపిస్తుంది. స్రావాలు ద్వారా వ్యాపిస్తుంది. డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా షేక్ హాండ్స్, కిస్సింగ్, హగ్గింగ్ ద్వారా కూడా వ్యాపిస్తుంది.

తాకడం వలన:

వస్తువులను, టెలిఫోన్, డోర్స్, బాత్రూం నాబ్స్, టాప్స్, బటన్స్ ద్వారా వ్యాపిస్తుంది. వస్తువుల వలన , బెడ్డింగ్ ద్వారా వ్యాపిస్తుంది. ఎంగిలి చేసిన వాటర్, ఆహారం తీసుకోవటం వల్ల రోగులతో సన్నిహితంగా ఉన్నా, ప్రయాణం చేసినా, వారికి సపర్యలు చేసినా ఈ వ్యాధి వ్యాపిస్తుదని తెలుసుకున్నారు. కొంతమంది ఎటువంటి లక్షణాలు లేకుండానే వ్యాధిని వ్యాపింపజేస్తారు. వీరిని సూపర్ స్పైడర్స్ గా గుర్తించారు.

డాక్టర్ కె. ఉమాదేవి , తిరుపతి

చెలి (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/