భారత్‌లో యూకే కరోనా..ఆరుగురిలో నిర్ధారణ

కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడి

Six UK returnees test positive for new mutant virus strain

న్యూఢిల్లీ: భారత్‌లోకి యూకే కొత్త రకం కరోనా వైరస్‌ ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. ఇందులో బెంగ‌ళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో మూడు శాంపిళ్లు, హైద‌రాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్‌లో కొత్త ర‌కం వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు తెలిపింది. ఈ ఆరుగురిని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్లు తెలిపింది.

వీళ్ల‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పింది. వీళ్ల‌తోపాటు ప్ర‌యాణించిన ఇత‌ర ప్ర‌యాణికులు, వారి కుటుంబాలు, ఇత‌రులను వెతికే ప‌నిలో అధికారులు ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచ‌న‌లు జారీ చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా కేంద్రం వెల్ల‌డించింది. ఇండియాతోపాటు ఇప్ప‌టికే డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, స్వీడ‌న్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, కెన‌డా, జ‌పాన్‌, లెబ‌న‌న్‌, సింగ‌పూర్ దేశాల‌కూ యూకేలో క‌నిపించిన కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ పాకింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/