జగన్‌కు ఏపి హైకోర్టు నోటీసులు

ఏపిలో మూడు రాజధానుల విషయంపై నోటీసులు జారీ

ap high court -cm jagan
ap high court -cm jagan

అమరావతి: సిఎం జగన్‌కు మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌తోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారంలోకి రాగానే మరో మాదిరి జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే విషయమై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఏపి ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టిడిపి, బిజెపిలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/