ఏప్రిల్‌లో భారత్‌కు రానున్న బ్రిటన్ ప్రధాని
boris johnson
లండన్: బ్రిగ్జిట్ అనంతర పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే వాణిజ్య అవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత బోరిస్ తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జనవరిలోనే భారత పర్యటనకు సిద్ధమయ్యారు. కరోనా ఉధృతి పెరగడంతో రద్దు చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్నా పర్యటన రద్దయింది.
ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో జీ7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదస్సుకు ముందే ఇండియాలో పర్యటించాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/