క్రాక్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

క్రాక్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు. గతకొంత కాలంగా సరైన బ్లాక్‌బస్టర్ అందుకోలేకపోయిన రామ్ చరణ్, ఈ సారి ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

కాగా కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లా్న్ చేసింది. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక చాలా రోజుల తరువాత అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముథ్రకని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి న్యూఇయర్ కానుకగా రాబోయే క్రాక్ ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.