యూపీలో ఘోర ప్రమాదం..

ఉత్తర్​ ప్రదేశ్​లోని కాన్పుర్ దెహాత్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నిండుగా ఉన్న బావిలో పడడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు చిన్నారులు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన ప్రకారం.. దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్​ స్టేషన్ పరిధిలో జగన్నాథ్​పుర్ గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు నీటి గుంటలో పడిపోయింది. వర్షం పడటం వల్ల అక్కడ నీటి గుంట ఉన్నట్లు వాహనదారుడు గమనించకపోయి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీసి గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆరుగురి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.