సూర్య42 నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్

హిట్ , ప్లాప్ అనేది సంబంధం లేకుండా తమిళ హీరో సూర్య వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తన 42 వ సినిమాలో బిజీ గా ఉన్నారు. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ ఫై వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతలుగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాగా ఈరోజు శుక్రవారం మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ మోషన్ పోస్టర్ లో యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా.. ఓ గద్ద ఆకాశంలో విహరిస్తూ సూర్య భుజంపై వాలడంతో అతని బ్యాక్ సైడ్ లుక్ అవుతుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి బీజీఎం సమకూర్చాడు. ఇందులో చేతిలో ఆయుధాలతో సూర్య ని ఒక వారియర్ గా కనిపిస్తున్నాడు. ఇదొక శక్తివంతమైన పరాక్రమవంతుడి సాగా అని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 3డీ లో రూపొందిస్తున్నామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దిశా పటానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రెడిన్‌ కింగ్స్, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.