కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌కు చెందిన బడ్జెట్‌లా ఉందిః క‌విత‌

this-budget-seems-like-it-is-for-few-states-said-mlc-kavitha

హైదరాబాద్‌: ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. కేంద్ర బ‌డ్జెట్ కొన్ని రాష్ట్రాల‌కు చెందిన బడ్జెట్‌లా ఉంద‌ని ఎమ్మెల్సీ క‌విత విమ‌ర్శించారు. మోడీ ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌న‌డానికి ఈ బ‌డ్జెటే ఊదాహ‌ర‌ణ అని ఆమె అన్నారు. 10 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పిస్తార‌ని ఆశించామ‌ని, ఎందుకంటే తెలంగాణ‌లో ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం మంత్రి ప్ర‌క‌టించిన రిబేట్ ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు.

అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాలు లేదా బిజెపి పాలిత రాష్ట్రాల‌కు మాత్రం ల‌బ్ధి చేకూరేలా కేంద్రం డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించింద‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. మౌళిక‌స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ప‌దివేల కోట్లు కేటాయిస్తున్నార‌ని చెప్పార‌ని, కానీ ఎటువంటి మౌళిక‌సదుపాయాలో ఆ బ‌డ్జెట్‌లో వెల్ల‌డించ‌లేద‌ని ఆమె విమ‌ర్శించారు. సుమారు వెయ్యి కోట్ల వ‌ర‌కు కేంద్రం త‌మ‌కు రుణ‌ప‌డి ఉంద‌ని, ఆ బాకీలు చెల్లించాల‌ని ఆర్ధిక‌మంత్రిని కోరుతున్న‌ట్లు క‌విత తెలిపారు.