ప్రియుడి బుగ్గలు కొరికేస్తున్న శృతి హాసన్..

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్..శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్ట్ తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే..మరోపక్క ప్రియుడి తో ఎంజాయ్ చేస్తుంది. కాస్త షూటింగ్ లో గ్యాప్ వస్తే చాలు తనకు ఇష్టమైన చోటుకు వెళ్లి ఏకాంతగా గడుపుతూ…ఆ పిక్స్ ను , వీడియోస్ ను షేర్ చేస్తుంటుంది.

తాజాగా వీరిద్దరూ లండన్ కు వెళ్లారు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో అక్కడికి వెళ్లినందుకు ఆమె ఆనందంగా స్పష్టంగా తెలుస్తోంది. శాంతను బుగ్గలు కొరికేస్తూ రచ్చ చేస్తోంది. అంతేకాకుండా అక్కడ వీధుల్లో తిరుగుతూ ఆమె ఎంజాయ్ చేస్తూ ఉండటం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ‘సలార్’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ హీరో కాగా ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ జూన్ 16న విడుదల కానుండగా మూవీ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.