లోకేష్ యాత్ర ను నపుంసకుడి యాత్ర అంటూ ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఫై వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా..తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లోకేష్ యాత్ర ను నపుంసకుడి యాత్ర అంటూ ఎద్దేవా చేసి వార్తల్లో నిలిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరు లో శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి..లోకేష్ యాత్ర ఫై పలు వ్యాఖ్యలు చేసారు.

నపుంశకునికి వివాహం చేస్తే వంశాభివృద్ది ఎలా జరగదో లోకేష్ పాదయాత్ర వల్ల కూడా ఏ ప్రయోజనము లేదని మండిపడ్డారు. నారా లోకేష్ పాదయాత్ర వంటి బలహీనమైన పాదయాత్ర దేశంలో ఎక్కడా జరగలేదని విమర్శలు చేశారు. నాణ్యమైన కరెంట్ కోసం వ్యవసాయ మీటర్లు బిగిస్తె పగలగొట్టండి అని చెప్పడం లోకేష్ అవివేకమని ఆగ్రహించారు. లోకేష్ పొరపాటున ఆడపిల్లల్లా ఉండి ఉంటే వగలమాలిన ఏడుపులు చూడలేకపోయేవాళ్లు అని ఎద్దేవా చేసారు.

మరోపక్క సోషల్ మీడియా లోను లోకేష్ యాత్ర ఫై పలు ట్రోల్స్ గట్టిగానే వస్తున్నాయి. సభ లో మరోసారి లోకేష్ తడబాటుగా మాట్లాడడం..నవ్వు తెప్పిస్తుంది. లోకేష్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియా లో వైస్సార్సీపీ వారు విపరీతంగా షేర్ చేస్తున్నారు.