నేడు తెలంగాణలో నాల్గు ప్రధాన హైవేలఫై తెరాస రాస్తారోకో

తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వo రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 04 న మండల స్థాయి నిరసనలు తెలిపిన తెరాస..ఈరోజు రాష్ట్ర ప్రధాన రహదారుల ఫై ఆందోళన చేపడుతున్నారు. నాగపూర్‌, బెంగళూరు, విజయవాడ, ముంబై హైవేలపై రాస్తారోకోలు మొదలుపెట్టింది.

కేంద్రం తెలంగాణ రైతుల దగ్గరున్న వరి పంట కొనకపోతే బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని
నిరసన లో పాల్గొన్న మంత్రులు కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు గులాబీనేతలు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 8న అన్ని గ్రామాల్లో ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండా ఎగరా వేస్తామన్నారు. 11న కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టే దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.