థియేటర్ లో 1+1 ఆఫర్ టికెట్ పెట్టిన థియేటర్ కు రాని ప్రేక్షకులు

తెలుగు రాష్ట్రాలలో రానున్న కాలంలో థియేటర్లు కనుమరుగు కానున్నాయా? ప్రస్తుతం ఉన్న థియేటర్స్ అన్ని ఫంక్షన్ హాల్స్ గా మారబోతున్నాయా..? అంటే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. కరోనా దెబ్బకు చిత్రసీమ కుదేల్ అయినా సంగతి తెలిసిందే. ఇదే టైములో ఓటిటి లు వచ్చి..ప్రస్తుతం హావ చూపిస్తున్నాయి. ఓటిటి లకు అలవాటు పడిన సినీ జనాలు థియేటర్స్ వైపు చూడడం మానేశారు. అంతే కాకుండా థియేటర్స్ లలో సినిమా టికెట్ భారీగా పెంచడం తో ఫ్యామిలీ తో కలిసి సినిమాను చూడలేక..కాస్త ఆగి ఓటిటి లో రిలీజ్ తర్వాత ఫ్యామిలీ అంత చూస్తున్నారు. దీంతో థియేటర్స్ వద్ద సినీ కళ తప్పింది.

చిన్న హీరోలు , పెద్ద హీరోలు ఇలా ఎవరి సినిమా వచ్చిన సరే..థియేటర్స్ కు జనాలు రావడం లేదు.
ఏ షో కు కూడా పట్టుమని పదిమంది కూడా రావడం లేదంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ తరుణంలో తాజాగా 1+1 ఆఫర్ టికెట్ పెట్టి ప్రేక్షకులను రప్పించే ప్రయత్నం చేసారు థియేటర్ యాజమాన్యం . కానీ ఆలా కూడా ప్రేక్షకులు రాలేదు. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ లో నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా రిలీజ్ అయింది. కొత్త సినిమా అయినా కానీ థియేటర్ కి జనాలు రావట్లేదు. దీంతో థియేటర్ యాజమాన్యం రూ.70తో ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అనే ఆఫర్ పెట్టింది. ఈ ఆఫర్ తో అయినా ప్రేక్షకులు క్యూ కడతారని భావించారు. కానీ హాల్లో కనీసం పావు శాతం కూడా నిండలేదు. దీంతో ఏం చేయాలో తేలిక థియేటర్ యాజమాన్యం వాపోతున్నారు. ఇలాగైతే థియేటర్స్ ను ఫంక్షన్ హాల్స్ గా చేసుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తున్నారు.