శివసేన నేత సంజయ్‌ రౌత్‌కు కస్టడీ పొడిగింపు

shiv-sena-mp-sanjay-rauts-judicial-custody-extended-till-october-10

ముంబయిః శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌కు పత్రాచాల్‌ భూ కుంభకోణం కేసులో కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీని అక్టోబర్‌ వరకు పొడిగించింది. అదే రోజు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనున్నది. పత్రాచాల్‌ రూ.1039కోట్ల భూ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ రౌత్‌ను జూలైలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దక్షిణ ముంబైలోని ఈడీ జోనల్‌ కార్యాలయంలో దాదాపు ఆరు గంటల పాటు విచారించిన అనంతరం జూలై 31న అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఆ తర్వాత ఆయనకు కోర్టు జ్యుడిషల్‌ కస్టడీ పొడించింది. ఇప్పటి వరకు పలుసార్లు కస్టడీ పొడిగించగా.. తాజాగా మరోసారి పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10న సంజయ్‌ రౌత్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/