తమ్ముడి చిత్రానికి అన్నయ్య బూస్ట్..

అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాను చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఈ క్రమంలో పుష్ప అల్లు అర్జున్..తమ్ముడి సినిమా కోసం రంగంలోకి దిగుతున్నాడు.

సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ పేరిట ఈ నెల 6వ తేదీన (ఆదివారం) భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ హాజరుకాబోతున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగబోతున్నట్లు అధికారిక ప్రకటన చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

అల్లు శిరీష్ – అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించగా, అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు. ‘మాయారే’ పాటను మాత్రం అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది. విరుద్ధమైన స్వభావాలు కలిగిన హీరో .. హీరోయిన్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడే హీరో .. పెళ్లికి మాత్రం నో అంటూనే అతనితో రొమాన్స్ చేసే హీరోయిన్. ఆ ఇద్దరి రొమాన్స్ కి కామెడీ టచ్ ఇచ్చే సునీల్ .. వెన్నెల కిశోర్ .. పోసాని పాత్రలు. ఇక ఆమని వైపు నుంచి అమ్మ ఎమోషన్ .. ఇలా కథ అని వైపులా నుంచి ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టయిన్ మెంట్ ను అందించడంతో, హిట్ టాక్ తెచ్చుకుంది.