ఎమ్మెల్సీ కవిత ఫై మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు చేసారు. రేపు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా కేసీఆర్ పార్టీ ప్రకటన గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత మధు యాష్కీ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఫై పలు వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయం కాదని అందరూ చెప్పారని.. లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కేసీఆర్ కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్నారని అన్నారు. కేసీఆర్ గాంధీ ప్రతినిధి కాదు..గాడ్సే ప్రతినిధి అని.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మూతి పగల గొట్టాలని కోరారు. తన చేతిని తన నెత్తిన కేసీఆర్ పెట్టుకుంటున్నారని.. BRS కూడా కేసీఆర్ కి VRS లాంటిదని చురకలు అంటించారు. ఏపీలో కొందరు వెలమలను కేసీర్ సంప్రదిస్తున్నారని.. తన కుల సామ్రాజ్యం పెంచుకోవడమే కేసీఆర్ కు పని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కవిత ఫై కూడా పలు వ్యాఖ్యలు చేసారు. కవితమ్మ ఎత్తుకునే పూల బతుకమ్మ లోపల లిక్కర్ బాటిల్లే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.