కరోనా పంజా..శిరిడీ ఆలయం మూసివేత

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవద్దని అధికారుల ప్రకటన

Shirdi Saibaba
Shirdi Saibaba

షిరిడీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథంలో దేశంలో ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భక్తుల తాకిడి అధికంగా ఉండే శిరిడీ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవబోరని ప్రకటించారు. బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని చెప్పారు. జనాల తాకిడి అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/