నేడు విశాఖకు పవన్ కళ్యాణ్

Pawan Kalyan to Visakhapatnam today

విశాఖ నగరం కాస్త పొలిటికల్ నగరంగా మారింది. వైస్సార్సీపీ , జనసేన, టీడీపీ పార్టీల నేతలతో రాజకీయంగా మారింది. అమరావతి రైతుల పాదయాత్ర , ‘మన విశాఖ-మన రాజధాని’ నినాదంతో వైస్సార్సీపీ ర్యాలీ , మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తో వైజాగ్ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.

జనవాణి కార్యక్రమంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన పర్యటన చేయబోతున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు చేసిన జనవాణికి ప్రజల నుండి విశేష స్పందన రాగ, విశాఖలో కార్యక్రమానికి భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ టూర్ కు సంబదించిన ఏర్పాట్లను మెగా బ్రదర్ నాగబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన విశాఖ కు చేరుకున్నారు.

పవన్ షెడ్యూల్ చూస్తే..

ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ ఏ డి ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్,బీచ్ రోడ్ మీదగా నోవాటల్ హోటల్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

ఇక రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలు తో సమావేశము ఉండనుంది. సోమవారం ఉదయం ప్రెస్ మీట్, అనంతరం విజయనగరం పార్టీ నేతలు తో సమావేశం కానున్నారు.