జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శలు

ys-sharmila-comments-on-jagan

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల మరోసారి సీఎం జగన్ ఫై విమర్శల వర్షం కురిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఫై ఎలాంటి విమర్శలు చేసిందో తెలియంది కాదు..పోలింగ్ అనంతరం జగన్ లొందన్ టూర్ కు వెళ్లడం..షర్మిల సైతం తన కుమారుడి దగ్గరికి వెళ్లడం..మిగతా అన్ని పార్టీల అధినేతలు , నేతలు రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. ఈ క్రమంలో షర్మిల..జగన్ విమర్శలు కురిపించడం స్టార్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షలు పూర్తి కావడంతో సర్టిఫికెట్ల కోసం స్కూలుకు వెళ్లగా.. తోటి విద్యార్ధి ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతే కాదు అతని స్నేహితులు నలుగురు వీడియోలు కూడా తీసి బెదిరింపులు మొదలుపెట్టారు. ఇవి శ్రుతిమించడంతో పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన వేళా…షర్మిల దీనిపై స్పందించింది.

రాష్ట్రంలో మహిళ భద్రత ఇలా ఉందంటూ ఓ పేపర్ క్లిప్ జోడించి అన్న జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మాట్లాడితే నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోందని షర్మిల విమర్శించారు.