ఇటలీలో 107 కరోనా మృతులు

3 వేల మందికి పైగా సొకిన కరోనా వైరస్‌

coronavirus
corona-virus-effect-on-italy

రోమ్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చైనాలో కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ ఈవైరస్‌ 80కిపైగా దేశాలకు విస్తరించింది. ఈనేపథ్యలో ఇటలీ, ఇరాన్‌ దేశాల్లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇటలీలో 107 మంది మృత్యువాత పడగా 3 వేల మందికి పైగా వైరస్‌ సోకింది. దీంతో పాఠశాలలు, వర్సిటీలను మూసివేశారు. జపాన్‌, యూఏఈ, లెబనాన్‌, ఇరాక్‌లోనూ స్కూళ్లను మూసివేశారు. చైనా వెలుపల నమోదైన కొత్త కేసుల్లో 80 శాతం పైగా ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియాలోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 95 వేల మందికి పైగా వైరస్‌ సోకగా.. 3,200 మంది మరణించారు. సౌదీ అరేబియాలో మక్కా యాత్రపై నిషేధం విధించారు. అమెరికాలో మృతుల సంఖ్య 11కు చేరింది. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త సైనిక విన్యాసాలు రద్దయ్యాయి. మరోవైపు స్విట్జర్లాండ్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. ఇరాన్‌లో కరోనా మృతుల సంఖ్య 107కు చేరింది. 3,513 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. కరెన్సీ నోట్ల వినియోగాన్ని తగ్గించాలని ఆరోగ్య మంత్రి సయీద్‌ నమాకి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరసగా రెండో శుక్రవారం ప్రార్థనలను రద్దు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/