ఏప్రిల్ 14 వరకూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల మూసివేత

రైల్వే శాఖ వెల్లడి

ఏప్రిల్ 14 వరకూ  రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల మూసివేత
Railway Reservation Counters Closure till April 14

New Delhi: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో భాగంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఏప్రిల్ 14 వరకూ పూర్తిగా మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ప్రయాణాలకు ఈ టికెటింగ్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవడానికి వెసులు బాటు కల్పించింది. 

 ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రయాణాల కోసం ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కౌంటర్లలో, ఆన్‌లైన్‌లో తీసుకున్న అన్ని టికెట్లకు ఇది వర్తిస్తుందని , వీటన్నింటికీ డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/