రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్ కి వివేకా అలాగే – షర్మిల

ఏపీ కాంగ్రెస్ చీఫ్ , ఎంపీ అభ్యర్థి వైస్ షర్మిల..ఎన్నికల ప్రచారంలో జగన్ ను మరింతగా టార్గెట్ చేస్తూ వస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల మాట్లాడుతూ.. కడప స్టీల్‌ ప్లాంటుకు జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేశారన్న ఆమె, స్టీల్ ప్లాంట్‌ను శంకుస్థాపన ప్రాజెక్టుగా మార్చారని విమర్శలు గుప్పించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్ కి వివేకా అలా ఉండే వారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యింది. ఎవరు చంపారో సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని వాపోయారు.

చనిపోయింది వైఎస్ఆర్ తమ్ముడు, హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్ లో కర్ఫ్యూ సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తే ఆర్టీపీపీని మాయం చేస్తారని ఆరోపించారు. ఇదే థర్మల్ ప్లాంట్ లో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ గారు పాదయాత్ర కొచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తొలి సంతకం ఇదే అవుతుంది అని చెప్పారని పేర్కొన్నారు.