కేసీఆర్ బస్సు యాత్ర రీషెడ్యూల్

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఫై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈసీ 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం ఫై నిషేధం విధించింది. దీంతో ముందుగా అనుకున్న బస్సు యాత్ర లో ఎలాంటి మార్పులు లేకుండా రీ షెడ్యూల్ ను రిలీజ్ చేసారు.

శుక్రవారం 8 గంటలకు ఈసీ విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో గులాబీ బాస్ బస్సు యాత్రను బీఆర్ఎస్ శ్రేణులు రీషెడ్యూల్ చేశాయి. ఈ నెల 3వ తేదీన (శుక్రవారం) సాయంత్రం 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో ముందు ప్రకటించిన విధంగానే యథావిధిగా కొనసాగనుంది.

  • ఈ నెల 3వ తేదీన (శుక్రవారం) సాయంత్రం 8 గంటల తర్వాత కేసీఆర్.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడే బస చేయనున్నారు.
  • ఈ నెల 4వ తేదీన (శనివారం) సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షో, 5వ తేదీన సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో నిర్వహిస్తారు.
  • 6వ తేదీన సాయంత్రం నిజామాబాద్ రోడ్ షో, 7వ తేదీన కామారెడ్డి రోడ్ షో.. అనంతరం మెదక్ లో రోడ్ షోలో పాల్గొంటారు.
  • ఈ నెల 8వ తేదీన నర్సాపూర్ అనంతరం పటాన్ చెరులో రోడ్ షో నిర్వహిస్తారు.
  • ఈ నెల 9న సాయంత్రం కరీంనగర్ లో గులాబీ బాస్ బస్సుయాత్ర, సాయంత్రం రోడ్ షో ఉంటుంది.
  • 10వ తేదీన చివరి రోజు సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్ధిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది.