‘వాల్తేర్ వీరయ్య’ ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ

గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంది.

ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్ సాంగ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో అంచనాలు పెంచారు. వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సాంగ్ చూశానని, మైండ్ బ్లోయింగ్ అని వెల్లడించారు. ఈ పాటలో చిరంజీవి ఎనర్జటిక్ గా డ్యాన్స్ చేశారని దేవిశ్రీ వెల్లడించారు. ఈ వార్తను లీక్ చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని తెలిపారు. వాల్తేర్ వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ ఈ వారంలో రిలీజ్ అవుతుందని తెలిపారు. అభిమానులూ… పార్టీకి రెడీగా ఉండండి… ఎందుకంటే ఇది బాస్ పార్టీ అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ లోని మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.