అర్జెంటీనా లెజెండ్‌కి ప్రధాని నివాళి

ఫుట్‌బాల్ ఆట‌లో మార‌డోనా ఓ జ్ఞాని..ప్రధాని

diego-maradona-was-a-maestro-of-football-tweets-pm-modi

న్యూఢిల్లీ: అర్జెంటీనా లెజెండ్ , పుట్‌బాల్‌ దిగ్గజం డీగో మార‌డోనా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపట్ల ప్రధాని మోడి సంతాపం తెలిపారు. ఫుట్‌బాల్ మైదానంలో మార‌డోనా త‌న కెరీర్‌లో ఎన్నో అత్యుత్త‌మ క్రీడా అద్భుతాల‌ను సృష్టించార‌న్నారు. మార‌డోనా ఆక‌స్మిక మ‌ర‌ణం అంద‌ర్నీ క‌లిచివేసింద‌ని ప్ర‌ధాని మోడి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫుట్‌బాల్ ఆట‌లో మార‌డోనా ఓ జ్ఞాని అని, ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌నికి మంచి పాపులారిటీ ఉంద‌న్నారు. మార‌డోనా ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆశిస్తున్న‌ట్లు మోడి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/