అధైర్య పడొద్దు… మంచి రోజులు వస్తాయ్: షర్మిల

మెదక్‌ జిల్లా చేర్యాలలో పర్యటన

Sharmila talking to venkatesh family members
Sharmila talking to venkatesh family members

Medak District: తెలంగాణ లో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా చేర్యాలలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. తాను మీ కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని , మంచి రోజులు వస్తాయని అన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగుల్లో అధిక శాతం తెలంగాణలోనే ఉన్నారని అన్నారు . ఏ లక్ష్యాలతో ఉద్యమ చేసి రాష్ట్రం సాధించుకున్నామో, ప్రస్తుత పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయన్నారు. అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/