నేడు పులివెందులలో సునీతతో కలిసి షర్మిల ప్రచారం..

Sharmila campaign with Sunita in Pulivendula today..

అమరావతిః ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు వైఎస్సార్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి రోడ్‌షోలు, సభల్లో పాల్గొంటారు. మరికాసేపట్లో వేంపల్లెలో బస్సుయాత్ర ప్రారంభిస్తారు.

లింగాల, సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం ఆరున్నర గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలను నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సుయాత్ర ముగుస్తుంది.