సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభ్యర్థిని ప్రకటించిన బిఆర్‌ఎస్‌

niveditha-announced-as-brs-candidate-for-secunderabad-cantonment-by-election

హైదరాబాద్‌ః సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

నివేదిత అక్క లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సాయన్న పెద్ద కుమార్తె అయిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించారు. అయితే ఈ మధ్యే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సాయన్న కుటుంబానికే అవకాశం ఇచ్చేందుకు కెసిఆర్ మొగ్గుచూపారు.