మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు అరుణ్ గాంధీ క‌న్నుమూత‌

Mahatma Gandhi’s grandson Arun Gandhi passes away at 89

ముంబయిః మ‌హాత్మా గాంధీ మ‌నుమ‌డు అరుణ్ గాంధీ(89) క‌న్నుమూశారు. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఈరోజు కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఆయ‌న కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. మ‌నీలాల్ గాంధీ, సుశీల మ‌షుర్‌వాలా దంప‌తుల‌కు 1934, ఏప్రిల్ 14వ తేదీన డ‌ర్బ‌న్‌లో అరుణ్ గాంధీ జ‌న్మించారు. మ‌హాత్మా గాంధీ అడుగుజాడ‌ల్లో అరుణ్ గాంధీ న‌డిచారు. సామాజిక కార్య‌క‌ర్త‌గా ఆయ‌న ఎదిగారు.