విశాఖలో హోంగార్డుకు కరోనా పాజిటివ్‌!

\

corona positive
corona positive

విశాఖపట్నం: విశాఖ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. నిన్న జిల్లా వ్యాప్తంగా నమోదు అయిన కేసులలో మూడు కేసులు నగరంలోనే నమోదు అయ్యాయి. ఇందులో ఓ మహిళా హోంగార్డ్‌ కూడా ఉన్నారు. దీంతో ఆమె నివసించే కొబ్బరితోట ప్రాంతంలో కలకలం రేగింది. ఆమె పనిచేస్తున్న పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిలోను గుబులు మొదలైంది. భాధితురాలిని వెంటనే గీతం ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ కు తరలించారు. మిగతా ఇద్దరిలో ఒకరు దండుబజార్‌ కు చెందిన మహిళ కాగా, మరొకరు గాజువాక ప్రియదర్శిని కాలనీకి చెందిన వ్యక్తి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/