కడప, పులివెందుల బరిలో షర్మిల, సునీత..?

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిల..అన్న ఫై పగ తీర్చుకునేందుకు భారీ స్కెచ్ వేస్తుంది. ఇప్పటీకే పబ్లిక్ మీటింగ్ లలో , నేతల సమావేశాల్లో వైసీపీ ఫై అన్న ఫై విమర్శలు కురిపిస్తున్న షర్మిల..ఇప్పుడు అన్నపై పోటీ చేయాలనీ ఫిక్స్ అయ్యింది.

వివేకా కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. వైఎస్ వివేకా హత్య తరువాత సునీత నేరుగా అవినాశ్ పైన న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ కేసుల్లో పలు ఆరోపణలు చేసారు. షర్మిల వైఎస్సార్టీపీ చీఫ్ గా దీక్షలు చేసే సమయంలోనూ సునీత కలిసి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సునీత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం వేళ ఈ ఇద్దరి భేటీ పైన ఆసక్తి కొనసాగుతోంది. సునీత తో సమావేశమై వచ్చే ఎన్నికల్లో పోటీపై చర్చించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి షర్మిల లేదా సునీత/ఆమె తల్లి సౌభాగ్యమ్మ బరిలో ఉంటారని సమాచారం. తాను ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటానని షర్మిల వారికి భరోసా ఇచ్చారట.