కేబీఆర్‌ పార్క్ లో నటి చౌరాసియాకు వేధింపులు..కానీ అసలు నిజం ఏంటి అంటే

హైదరాబాద్ లోని కేబీఆర్‌ పార్క్‌లో సినీ నటి చౌరాసియాకు ఓ యువకుడి నుండి వేదింపులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. గత రాత్రి (బుధవారం) 7 గంటల సమయంలో తాను జాగింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెంబడించాడని పిర్యాదు లో తెలిపింది. భయంతో సెక్యూరిటీ సిబ్బందికి విషయం తెలియజేశానని వెల్లడించింది. చౌరాసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కానీ చౌరాసియా వెంట ఎవరూ పడలేదని పోలీసులు నిర్ధరించారు. అతడు కూడా జాగింగ్ కోసమే వచ్చాడని తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారించినట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అతడిని వదిలేసినట్లు తెలిపారు. గతంలో ఓసారి చౌరాసియాపై దాడి జరగటంతో ఆ భయంలోనే ఉన్న ఆమె.. సదరు వ్యక్తి అనుమానస్పదంగా ఉండటంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నటి చౌరాసియాకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.