షాద్‌నగర్ వద్ద రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు

ఇటీవల కాలంలో రన్నింగ్ కారులో మంటలు చెలరేగడం..క్షణాల్లో అగ్నికి ఆహుతివ్వడం వంటి సంఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. తాజాగా షాద్‌నగర్ జాతీయ రహదారి ఫై అలాగే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి కుటుంబంతో సహా కారులో మహబూబ్ నగర్ బయల్దేరాడు. ఈ క్రమంలో షాద్‌నగర్ సోలిపూర్ శివారు ప్రాంతానికి రాగానే.. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల్ని గమనించిన నవీన్.. ఒక్కసారిగా బ్రేక్ వేసి కారును పక్కకు ఆపేశాడు.

అనంతరం తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి అందర్నీ కిందకు దించేశాడు. క్షణాల వ్యవధిలోనే కారు మెుత్తం మంటలు వ్యాపించి కాలి బూడిదైంది. నవీన్ సకాలంలో స్పందించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షార్ట్ సర్క్కూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గత నెలలో కేరళలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో తన భర్త కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. కారులో ఉన్నట్లుండి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో భార్య, భర్తలిద్దరూ కాలి బూడిదయ్యారు.