బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బండి సంజయ్..హైకోర్టు ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. వర్ధన్ పేట్ ACP ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది. ఇక ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో..అక్కడినుండే పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు బండి సంజయ్.

ఇక పిలీసులు ఇచ్చిన నోటీసులో ఏముందంటే..పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని ..రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.

మరోపక్క బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడం సంచలనంగా మారింది. పీడీ యాక్ట్ అమలు చేస్తే ఆయనకు ఏడాది వరకు బెయిల్ లభించే అవకాశముండదు. అయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.