శాకుంతలం నుండి బిగ్ అప్డేట్ రాబోతుంది

దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోగా..రిలీజ్ కు బ్రేక్ లు పడుతూ వస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ రేపు చిత్రం తాలూకా బిగ్ అప్డేట్ ను ప్రకటించబోతున్నట్లు తెలిపి ఆత్రుత పెంచారు. కాళిదాస్ శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించింది. అయితే సాధారణ కమర్షియల్ చిత్రాలనే కళాత్మకంగా తీర్చిదిద్దే గుణ శేఖర్.. ఇలాంటి మైథలాజికల్ ఫిల్మ్ విషయంలో ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తాడని అభిమానులు సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.