అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ , ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్‌లు పాల్గొన్నారు.

అంతకు ముందు మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ప్రారంభించారు. పెద్ద చెరువు సుందరీకరణ, కేసీఆర్ పార్కులో వాచ్ టవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడనున్నారు.

సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్‌ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కులో జంగల్‌ సఫారీని ప్రారంభించనున్నారు. అటునుంచి హైదరాబాద్‌కు పయణమవుతారు.