చైతు క‌స్ట‌డీ గ్లింప్స్ వ‌చ్చేసింది

నాగ చైతన్య 22 వ చిత్రానికి ‘కస్టడీ ‘ మూవీ కి సంబదించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో NC22 పేరిట ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో ప్రియమణి తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వారి పాత్రల తాలూకా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి నింపారు.

ఈరోజు న్యూ ఇయర్ సందర్భాంగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో చైతన్య ఇంట్రో సీన్ అదిరిపోయింది. సీనియస్ యాక్షన్ లుక్ లో న్యూ వేవ్ లో కనిపిస్తున్నాడు. చై పంచ్ పవర్ తొలిసారి రుచి చూపించాడు. అది భారీ యాక్షన్ సీన్ లో కట్ లా ఉంది. లాంగ్ షాట్ లో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రాక్ పై వేగంగా రన్నింగ్ ట్రైన్… రోడ్డుపె కార్లు ఛేజింగ్ ఇంట్రెస్టింగ్. గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చైతు అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.

YouTube video