టిడిపి ప్రభుత్వం రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ‌: లోకేశ్‌

nara-lokesh-on-high-court-bench-in-kurnool

కర్నూలు: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కోర్టు భవనం దగ్గరకు లోకేశ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను కలిసిన జిల్లా న్యాయవాదులు.. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హామీ ఇచ్చారు. ‘‘జగన్‌ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్‌ కాదు మాది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం’’ అని చెప్పారు. హైకోర్టు బెంచ్‌ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.